విద్యార్థులకు “పొగాకు మరియు మత్తు పదార్థాలు వలన కలిగే అనర్థాలు ” పై అవగాహన కల్పించడం జరిగింది.
ముదిగొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు “పొగాకు మరియు మత్తు పదార్థాలు వలన కలిగే అనర్థాలు ” పై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ యుక్త వయసులో విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా జాగ్రత్తగా ఉండాలని, క్రమశిక్షణ,సత్ప్రవర్తనతో జీవితంలో ఎదిగి తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. A.అరుణా దేవి, డా. సోహైల్, మానసిక వైద్య నిపుణులు,
జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ సత్యనారాయణ గారు,
కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీ పి. శ్రీనివాసరావు,
నషా ముక్త్ భారత్ కోఆర్డినేటర్ , శ్రీమతి టి.ఉష గారు లెక్చరర్స్, PHC వైద్యాధికారి డా .J. నాగేంద్ర ప్రసాద్,
CHO మధుసూదన్, ANM శ్రీమతి వసంత, మరియు ఆశా లు పాల్గొన్నారు.










