అర్హులందరికీ చేయూత”నిస్తాం..
అండగా నిలుస్తాం
పొంగులేటి..
దీపావళి నాడు తీపి కబురు చెప్పాం.. ఇప్పుడు పల్లెల్లో పింఛన్ల పండుగ తీసుకొచ్చాం
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
నేలకొండపల్లిలో 1,138 మంది నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
నేలకొండపల్లి: ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా అందించాలని గొప్ప సంకల్పంతో మన ప్రజా ప్రభుత్వం చేయూత పథకం ద్వారా అర్హులందరికీ అండగా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అన్నారు. శుక్రవారం నేలకొండపల్లిలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో చేయూత పథకం కింద నూతనంగా 1,138 మందికి పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోని 8 ఏళ్లలో కొత్త పింఛన్లు అనేదే ఇవ్వలేదని, కాళ్ళరిగేలా తిరిగినా, కళ్ళు కాయలు కాసేలా ఏళ్లుగా ఎదురుచూసినా వారు చలించలేదని, ఎన్నికలకు ముందు తన పర్యటనల్లో పేదల గోస చూసి ఆవేదన చెందానని మన ప్రజా ప్రభుత్వం వచ్చాక.. కొత్తగా పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. దీపావళి పండుగ రోజన రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి ఇవ్వబోతున్నట్లు ప్రకటించి.. ఆచరణలోకి తెచ్చామని అన్నారు. గత పాలకులు కమీషన్ల కోసం లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి.. కూలేశ్వరంగా మిగిల్చారని విమర్శించారు. ఇంకా అర్హులు ఉంటే.. కచ్చితంగా పింఛన్లు మంజూరు చేసి అండగా నిలుస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని అభయమిచ్చారు.నేలకొండపల్లి మండలంలో కొత్తగా 1,138 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వీరికి ప్రతినెలా మొత్తం రూ.30,16,208 పింఛను రూపంలో అందనుంది. నవంబర్ 13, 2026 నాటికి మండలంలో మంజూరైన కొత్త పింఛన్ల వివరాలను అధికారులు వెల్లడించారు.
వర్గాల వారీగా వివరాలు ఇలా..
దివ్యాంగులు – 361 మంది (నెలకు రూ.14,49,776)
ఒంటరి మహిళలు107మంది
(రూ.2,15,712)
గీత కార్మికులు – 64 మంది (రూ.1,29,024)
చేనేత కార్మికులు –2 ఇద్దరు(రూ.4,032)
వితంతువులు – 604 మంది(రూ.12,17,664)
మొత్తంగా 1,138 మందికి నెలకు రూ.30.16 లక్షలకుపైగా పింఛన్ల రూపంలో ఆర్థిక సహాయం అందనుంది. దివ్యాంగులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.4,016, మిగిలిన వర్గాలకు రూ.2,016 చొప్పున పింఛను మంజూరైనట్లు అధికారులు తెలిపారు. పాత పింఛన్లతో కలుపుకొని మొత్తం 9,428 మందికి నెలకు రూ.1,64,40,896 లబ్ధి చేకూరుతోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో. అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఎంపీడీవో ఎం ఎర్రయ్య, తాసిల్దార్ పి రాంప్రసాద్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు కొడాలి గోవిందరావు, సీనియర్ నాయకులు శాఖమూరి రమేష్, నెల్లూరి భద్రయ్య, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, పలువురు సర్పంచ్ లు, కట్టెకోల నాగార్జున,బట్టపోతుల నాగమణి, కిరణ్,
బోయిన వేణు, రామారావు, ఉప సర్పంచ్ లు, మద్దినేని మహేష్, ప్రజా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.









