యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో మేరా యువ భారత్ – ఖమ్మం ఆధ్వర్యంలో క్లస్టర్ ఆఫ్ బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ ను 2026 నవంబర్ 15వ తేదీన నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడా జట్లు, క్రీడాకారులు మరియు క్రీడలపై ఆసక్తి కలిగిన యువతీ యువకులకు ఆహ్వానం పలుకుతున్నారు.
పోటీల వివరాలు:తేదీ: 15-11-2026 (ఆదివారం)
వేదిక నేలకొండపల్లి
వయస్సు:15 నుండి 29 సంవత్సరాల మధ్య
అర్హులు: పురుషులు మరియు మహిళలు
నిర్వహించనున్న క్రీడా పోటీలు:1. కబడ్డీ 2. బ్యాడ్మింటన్ 3. 100 మీటర్ల పరుగు పందెం 4. టాగ్ ఆఫ్ వార్.క్రీడలపై ఆసక్తి కలిగిన యువతీ యువకులు, క్రీడా సంఘాలు మరియు జట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మేరా యువ భారత్ – ఖమ్మం నిర్వాహకులు కోరుతున్నారు.
మరిన్ని వివరాలకు మరియు పాల్గొనేందుకు సంప్రదించవలసిన వ్యక్తి:
కొక్కిరేనీ నాగపృథ్వీరాజ్.
మేరా యువ భారత్ యువ వాలంటీర్ నేలకొండపల్లి-కూసుమంచి-తిరుమలాయ పాలెం బ్లాక్
మొబైల్: 8688513376
నిర్వాహకులు:
మేరా యువ భారత్ ఖమ్మం
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం










