E-PAPER

ఖమ్మం కలెక్టరేట్‌ సమీపంలో ఈవీ కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

ఖమ్మం కలెక్టరేట్‌ సమీపంలో ఈవీ కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం..

23 Oct 2026, 3:41 pm PRAJA VEDIKA NEWS

ఖమ్మం కలెక్టరేట్‌ సమీపంలో ఈవీ కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం.. ఖమ్మం ప్రజా వేదిక న్యూస్...

ఖమ్మం నగరంలోని వెంకటాయపాలెం సమీపంలో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం దగ్గర కొత్తగూడెం వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్‌ (ఈవీ) కారులో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారు నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు ముందుగానే అప్రమత్తమై వాహనం నుంచి దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

కలెక్టరేట్‌ సమీపంలోని ప్రధాన రహదారిపై కారు దగ్ధం కావడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇటీవల ఖమ్మంలో ఎలక్ట్రిక్‌ కారులో మంటలు చెలరేగిన ఘటనలో ప్రముఖ వైద్యుడు జగదీష్‌ సజీవ దహనమైన ఘటనను స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా మరో ఈవీ కారులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ప్రాణాపాయం తప్పిందని పేర్కొంటున్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Generating image…

ఖమ్మం కలెక్టరేట్‌ సమీపంలో ఈవీ కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం.. ఖమ్మం ప్రజా వేదిక న్యూస్…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!