చెరువు మాదారం స్కూల్లో టీచర్ గా పని చేయు టీచర్ చెరువుమాదారం నుండి నెలకొండపల్లి వస్తుండగా మార్గమధ్యలో ఆమె హ్యాండ్ పోగొట్టుకున్నది ఆ హ్యాండ్ బ్యాగ్ దొరికిన రాయగూడెంకు చెందిన బోయిన ఉమామహేశ్వరరావు, హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చి అందులో ఉన్న రెండు సెల్ ఫోన్ లను బ్యాగును పోలీసువారి సమక్షంలో ఆమెకు హ్యాండ్ బ్యాగ్ ని అందజేశారు. ఈ సందర్భంగా కూసుమంచి సీఐ టి. సంజీవ్, మరియు నెలకొండపల్లి ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి, అతన్ని అభినందించారు, మరియు ఎవరైనా వస్తువుల్ని పోగొట్టుకున్నట్లయితే దొరికిన ప్రతి ఒక్కరు వస్తువుల్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి వారి నిజాయితీని చాటుకోవాలని తెలిపినారు.
Post Views: 21










