భారతీయ జనతా పార్టీ నేలకొండపలి మండల ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివ్వాళ్ళు అర్పించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ నేలకొండపలి మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ
మహర్షి వాల్మీకి సంస్కృతంలో మొట్టమొదటి మహాకావ్యమైన రామాయణం రచించినందువల్ల ఆదికవిగా ప్రసిద్ధి చెందారని,వాల్మీకి మహర్షి అసలు పేరు రత్నాకరుడని అన్నారు,విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించి, కుటుంబ పోషణ కోసం అడవుల్లో దారిదోపిడీలు చేసేవాడని
ఒకసారి ఆ దారి గుండా వెళ్తున్న దేవర్షి నారదుడును రత్నాకరుడు అడ్డగించాడని అప్పుడు నారదుడు అతన్ని ఒక ప్రశ్నడిగాడు: “నీవు చేసే ఈ పాపంలో నీ కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారా అని అడిగాడని రత్నాకరుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడగగా, నీ పాపంలో మాకు సంబంధం లేదు, నువ్వు చేసే దోపిడీకి మేమెందుకు బాధ్యులమవుతాము అని వారు చెప్పారని,తన కుటుంబం కోసం తాను చేసిన పాపాలు వ్యర్థమని తెలుసుకున్న రత్నాకరుడు జ్ఞానోదయం చెంది, నారదుని శరణు కోరాడని,ఆయన జీవిత చరిత్ర తెలుపుతుందని,తరువాత నారదుడు ఆయనకు రామ రామ అని జపించడం అనే మంత్రోపదేశం చేశాడని అన్నారు, ఒకరోజు వనంలో క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షి మరణాన్ని చూసి ఆయన మనసు ద్రవించింది. ఆ సమయంలో ఆయన నోటి నుండి అనుకోకుండా ఒక శోకం పద్యం వెలువడిండని అన్నారు
బ్రహ్మదేవుని ఆదేశం మేరకు, శ్రీరాముని పవిత్ర చరిత్రను రామాయణం పేరుతో సంస్కృతంలో ఆదికావ్యంగా రచించారని,
ఈ రామాయణం మొత్తం 24,000 శ్లోకాలతో, 7 కాండలుగా బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ మరియు ఉత్తర కాండలు కూర్చబడింది.
బోయవాడు వాల్మీకి మహర్షిగా వారి జీవిత చరిత్ర నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు సయ్యద్ మోహినుద్దీన్, కందరబోయిన వెంకటేశ్వర్లు, ఏపూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు










