E-PAPER

గవర్నర్ కోటాలో బీసీలకు ఎమ్మెల్సీ కేటాయించాలి బీసీ ఐక్యవేదిక..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

గవర్నర్ కోటాలో బీసీలకు ఎమ్మెల్సీ కేటాయించాలి బీసీ ఐక్యవేదిక..

22 Oct 2026, 6:33 pm PRAJA VEDIKA NEWS

ఖమ్మం, అక్టోబర్ 22 ( ప్రజా వేదిక న్యూస్ ): ఖమ్మం. గవర్నర్ కోటాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ నాయకులకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పొదిల సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి యలమందల జగదీష్ డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.గత 26 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎదిగి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన డాక్టర్ లోకేష్ యాదవ్‌తో పాటు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జంపాల రాజేష్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలని కోరారు.బీసీల జనాభా 60 శాతానికి పైగా ఉన్నప్పటికీ చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014, 2018, 2023 ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ, మంత్రి పదవుల్లో తగిన అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. ‘ఓట్లు మావి.. సీట్లు మీవా?’ అంటూ ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు రాజకీయంగా న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బత్తుల వీరబాబు, పగడాల హనుమంతరావు, రాగం కోటి, నాగరాజు, వినయ్, వంశీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!