అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి.పాగర్తి సుధాకర్..
నేలకొండపల్లి, మండల కేంద్రం లో ఈ రోజు : ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు భాగస్వామి కావాలని భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో నేలకొండపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటు నమోదు ఆవశ్యకతను వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పాగర్తి సుధాకర్,మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో అవసరమన్నారు. సమాజ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలంటే అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని తెలిపారు.మండలంలోని అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరూ తమ విలువైన ఓటు హక్కును నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. పట్టభద్రుల ఓటు నమోదు ద్వారా విద్యావంతులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన పట్టభద్రులు సంబంధిత నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేసుకోవడంతో పాటు, తమకు తెలిసిన ఇతర పట్టభద్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు మన్నే కృష్ణారావు, సయ్యద్ మోహినుదిన్,కందరబోయిన గోపి, తదితరులు పాల్గొన్నారు.










