*వీరబ్రహ్మేంద్ర నగర్ లో ఘనంగా దసరా సంబరాలు*
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర నగరంలో దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధారావత్ మోహన్ నాయక్, కాంగ్రెస్ మండల నాయకులు,తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తదుపరి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని చండీ హోమం కార్యక్రమం తిలకించినారు . వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పసుమర్తి చందర్రావు, లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, యువనాయకులు ఆళ్లకుంట నరసింహారావు,పెద్ద బోయిన శ్రీనివాసరావు, తోట సుబ్బారావు, నోటి కృష్ణారెడ్డి, పరిమి భరత్, మట్ట రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు శివనాథచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










