ఖమ్మం, అక్టోబర్ 23 ప్రజా వేదిక న్యూస్ ఖమ్మం నగరంలోని శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించిన ఘటనపై ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం శ్రీరామ్ హిల్స్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు సంబంధించిన రూ.10 వేల నగదు, 15 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల ఆచూకీ తెలియాల్సి ఉంది.
Post Views: 43










