దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ విధానం!
ఏపీ పైలట్ ప్రాజెక్ట్ విజయంతో విస్తరణకు కేంద్రం సిద్ధం.. తెలంగాణ, ఒడిశాపైనా దృష్టి
తిరుపతి, అక్టోబర్ 21 ( ప్రజా వేదిక న్యూస్ ) : దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో రేషన్ బియ్యం సరఫరాను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ విధానాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే యో
ఏపీ పైలట్ ప్రాజెక్ట్ విజయంతో విస్తరణకు కేంద్రం సిద్ధం.. తెలంగాణ, ఒడిశాపైనా దృష్టి
తిరుపతి, అక్టోబర్ 21 ( ప్రజా వేదిక న్యూస్ ) : దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో రేషన్ బియ్యం సరఫరాను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ విధానాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే యోచనలో ఉన్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించినట్లు వార్తా కథనం పేర్కొంది. ఈ విధానం ద్వారా రేషన్ బియ్యం సరఫరాపై పర్యవేక్షణ పెంచి, అక్రమ రవాణాను అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది.










