*రాష్ట్రస్థాయి పోటీలకు రాశేమిథా ఎంపిక.*
*చింతకాని, అక్టోబరు 19: ( ప్రజా వేదిక ప్రతినిధి):*
రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు కోమట్లగూడెం గ్రామానికి చెందిన బి. రాశేమిథా ఎంపిక కావడం పట్ల గ్రామ సర్పంచ్ కొండూరి పరిశుద్ధరావు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థినులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. రాశేమిథా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థినుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాశేమిథా సాధించిన ఘనత పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.










