రాజేశ్వరపురం గ్రామంలో జరగనున్న శ్రీ మహా పడిపూజ కి లక్ష విరాళం..
పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, రూ. 1,00,000/- (లక్ష రూపాయలు) విరాళం.
రాజేశ్వరపురం గ్రామంలో జరగనున్న శ్రీ మహా పడిపూజ మరియు అగ్నిగుండం మహోత్సవం సందర్భంగా, పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, తన వంతు సహాయంగా రూ. 1,00,000/- (లక్ష రూపాయలు) విరాళంగా అందించారు.మహా పడిపూజ మరియు అల్పాహార కార్యక్రమాల నిర్వహణ కోసం గ్రామ పెద్దలు, అయ్యప్ప స్వాముల సమక్షంలో ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి, మరియు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలు. సుఖసంతోషాలతో వర్థిల్లాలని అయ్యప్ప స్వాములు ఆశీర్వదించారు.
ఈ విరాళా కార్యక్రమంలో సర్పంచ్ కోటి సైదా రెడ్డి, రాజేశ్వరపురం సర్పంచ్ దండా రంగయ్య, పైనంపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు డాక్టర్ నాగబండి శ్రీనివాసరావు, పలువురా అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు









