బుద్దారంలో నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి, కొడాలి గోవింద రావు..
నేలకొండపల్లి మండలం, బుద్దారం గ్రామంలో ఆరెకట్ల గురవయ్య, నూతన గృహ ప్రవేశ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్యాంపు కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడాలి గోవింద రావు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన ఆరెకట్ల గురవయ్య కుటుంబ సభ్యులకు వారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి నూతన పట్టు వస్త్రాలు బహుకరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,జిల్లా నాయకులు నెల్లూరి భద్రయ్య, మండల పార్టీ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, ఏఎంసీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, శాఖమూరి రమేష్, బొడ్డు బొందయ్య, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.









