తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఆర్‌జేసీ కృష్ణ ఏకగ్రీవ ఎన్నిక..
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా ఆర్‌జేసీ కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహంలో నిర్వహించిన సమావేశంలో హాస్టల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కనకం జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, మున్నూరుకాపు సంఘ సభ్యులు ఆర్‌జేసీ కృష్ణ పేరును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ప్రకటించారు . ఈ సందర్భంగా ఆర్‌జేసీ కృష్ణ మాట్లాడుతూ మున్నూరుకాపు కుటుంబాలు సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లుగా సంఘ నాయకత్వం ఆశించిన స్థాయిలో కుల కుటుంబాల అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. తమ సంఘం వెనుకబడిన మున్నూరుకాపు కుటుంబాల అభ్యున్నతికి అన్ని రంగాల్లో కృషి చేస్తుందని, వారి ప్రగతే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు . సంఘ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ లక్కినేని రఘు మాట్లాడుతూ జిల్లా నుంచి ఇప్పటివరకు మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలు, ఇతర కీలక చైర్మన్ పదవుల్లో ప్రాతినిధ్యం పొందకపోవడం విచారకరమన్నారు . సంఘ ప్రధాన కార్యదర్శి బచ్చు విజయ్ కుమార్ మాట్లాడుతూ గత సంఘం వనభోజనాలకే పరిమితమైందని, ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందని, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వసతి గృహ విస్తరణపై దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు . ఈ సమావేశంలో ట్రెజరర్ పిన్ని కోటేశ్వరరావు , ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు , పట్టణ కమిటీ అధ్యక్షుడు కనకం భద్రయ్య , పట్టణం సెక్రెటరీ ఎర్ర జ్ఞానేశ్ , యూత్ అధ్యక్షుడు మాటేటి కిరణ్ , కమిటీ సభ్యులు కోయిల వీరభద్రం , కుమ్మరికుంట్ల సత్యనారాయణ , కనకారావు , గుండెపునేని రాజా , డాక్టర్ లక్ష్మి , రాధిక , ఊర్మిళతో పాటు మున్నూరుకాపు జేఏసీ నాయకులు , బచ్చు మధు , మాడూరి సైదారావు , ఎర్ర అప్పారావు , మాటేటి రవి , రాపర్తి రాజా , నరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు .









